మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి సోమవారం నాడు మొదటి రోజుకు సమానంగా బుకింగ్స్ నమోదు చేస్తూ రీజినల్ సినిమాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా క్రేజ్ ఎంతలా ఉందో టికెట్ సేల్స్ స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ అయిన బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లలో కలిపి కేవలం 4 రోజుల్లోనే 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఐదో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా బలంగా ఉండటంతో పాటు, ఏపీ, తెలంగాణ అంతటా ఇప్పటికే పలు ప్రధాన కేంద్రాలలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రవితేజ కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది.
మాస్ మహారాజా కి ఈ చిత్రం రానున్న లైనప్ కి మంచి బిజినెస్ ని క్రియేట్ చేసింది అనడములో సందేహం లేదు. దిల్ రాజు నిర్మాత గా హర్షిత్ గోలీ దర్శకత్వం లో శ్రీ విష్ణు తో కలిసి మల్టిస్టారర్ చేస్తున్నాడు. మరో సినిమాగా సరిపోదా శనివారం చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా రవితేజతో సినిమా చేయనున్నాడు. ఇది కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. రవితేజ లైనప్ చూస్తుంటే బ్యాక్ టూ మాస్ మహారాజా అనిపిస్తుంది.



Comments
Post a Comment