టాక్సిక్ చిత్రం విడుదలకు ముందు సంచనాలు
సృష్టిస్తుందని అంచనాలు వేశారు. కానీ రిసల్ట్ తేడా కొట్టింది. సినిమా డిజాస్టర్
అనిపించుకుంది. యష్ లాంటి పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్న హీరో తన kGF లాంటి బ్లాక్
బస్టర్ హిట్ తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాలు ఈ చిత్రం మీద పని చేసి తను కూడా ఈ
చిత్రానికి రచయిత గా సహ నిర్మాతగా బాఘస్వామ్యం అయ్యి ఎన్నో ఆశలతో విడుదల చేశారు.
ఇదొక అడల్ట్ కంటెంట్ అని జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే సినిమాని ఆడియన్స్ ఏ
రేంజ్ లో అసహ్యించుకుంటున్నారో అర్థం అవుతుంది.
గీతు మోహన్ దాస్ ఈమె మలయాళీ నటి మరియు దర్శకురాలు. 2013 లో, ఆమె
దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం “లైయర్స్ డైస్” రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్
ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి
చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా
భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, షార్ట్ లిస్ట్ అవ్వలేదు. కానీ
ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన అంతర్జాతీయ
అవార్డులను, రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. 2019
లో నవీన్ పౌలీ హీరోగా “మూతన్” అనే మలయాళ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్
ఫెస్టివల్ లో వరల్డ్ ప్రీమియర్ చిత్రంగా ప్రదర్శింపబడింది. పలు అవార్డ్స్ కూడా
సొంతం చేసుకుంది. ఈమె భర్త రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్. ఈయన దుల్కర్ సల్మాన్ లాంటి
హీరో తో కమ్మటి పాడమ్ మరియు కుట్టవుమ్ శిక్షయుమ్ లాంటి చిత్రాలకు దర్శకుడిగా పని
చేశారు. మలయాళం,హిందీ,తమిళం తో పాటు తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
హీరోగా చేసిన “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సాయి రామ్ శంకర్ హీరోగా చేసిన ఒక
పథకం ప్రకారం చిత్రాలకు సినిమాటోగ్రాఫర్
గా వర్క్ చేశారు.
గీతూ దర్శకత్వం వహించిన చిత్రాలకు ఆమె భర్త రాజీవ్
రవినే సినిమాటోగ్రాఫర్. ఆమె గత చిత్రాలు టెక్నికల్ అంశాలతో పాటు కథ బలం ఉన్న చిత్రాలుగా
మంచి పేరు ని దక్కించుకున్నాయి. టాక్సిక్ ఎక్కడ మిస్ ఫైర్ అయ్యిందో మరి..యష్ కానీ
గీతూ మోహన్ దాస్ కానీ లైఫ్ లో మరిచిపోలేని పరాజయాన్ని పొందారు. విడుదలకు ముందు మేకర్స్ ఈ చిత్రాన్ని ఇండియా గర్వించే చిత్రం అన్నారు కానీ ఆడియన్స్ అసహ్యించుకుంటున్నారు కథలో యష్ ప్రమేయం
వలన జరిగిందా లేక గీతూ నే సరైన కథనాన్ని అల్లుకోలేకపోయిందా..? ప్రస్తుతం ఈ సినిమా
డిజాస్టర్ గురించి సోషల్ మీడియాలో మీమ్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి.


Comments
Post a Comment