లైనప్ మార్చబోతున్న రవితేజ ?

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమా హిట్ సాదించడంతో కొత్త ప్రాజెక్టుల విషయంలో తన ప్లాన్‌ను మరోసారి మార్చబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ప్రకటించిన సినిమాలతో పాటు రెండు కొత్త కథలు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకటి దిల్ రాజు బ్యానర్ లో హర్షిత్ గోలి దర్శకుడు కాగా మరొకటి సరిపోదా శనివారం సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ రవితేజ తో సినిమాను ప్లాన్ చేసుకున్నాడు.  షూటింగ్ షెడ్యూల్ రెండింటినీ బ్యాలెన్స్ చేసేందుకు లైనప్‌ను రీషఫుల్ చేస్తున్నట్టు సమాచారం.


ఏ చిత్రం ముందు గా స్టార్ట్ అవుతుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు ఈ మాస్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

Comments